Hyderabad Boy Nala death Case Update బాచుపల్లిలో నాలాలో గల్లంతై బాలుడు మృతి ఇద్దరిపై కేసు నమోదు Hyderabad Boy Nala death Case Update : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన (Hyderabad Boy Drowned in Nala) మిథున్ రెడ్డి(4) అనే బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.నాలాపై ఉండే మూతను ఎందుకు తొలగించారనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన రోజు ఉదయం 8:00 గంటలకు వాచ్‌మెన్ మ్యాన్‌హోల్ మూత తీశాడు. దగ్గరుండి మరీ మూతను కాలనీ అసోసియేషన్ ప్రతినిధి తీయించారు. ఉదయం 11:00 గంటలకు మిథున్ రెడ్డి తెరిచిఉన్న మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతయ్యాడు. మూత తెరిచి పెట్టి.. ఈ ప్రమాదానికి కారణమైన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Huge Traffic in Hyderabad Rains : వరుణ్ బ్రో కొంచెం గ్యాప్ తీసుకో.. ఈ ట్రాఫిక్‌లో ఇళ్లు చేరేదెలా..?
Hyderabad Boy Drowning Case Update :మరోవైపు ఈ ప్రమాదంపై నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఎన్‌ఆర్ఐ కాలనీలోని బాలుడి ఇంటి వద్ద నాలా మూత, చుట్టుపక్కల తాత్కాలికంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు దీనికి బాధ్యుడిని చేస్తూ వార్డు ఆఫీసర్‌ను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ గోపి పేర్కొన్నారు. స్థానిక ఏఈపై కూడా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. వర్షాలు పడిన సమయంలో స్థానికంగా ఉన్న ప్రజలు నాలాలపై కానీ మ్యాన్‌హోల్ మూతలను తొలగించవద్దని గోపి సూచించారు.
Two Workers Stuck in Vaagu Viral Video : అకస్మాత్తుగా వరద.. వాగు మధ్యలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు.. చివరకు..!
అసలేం జరిగిందంటే: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం మిడ్తనపల్లికి చెందిన సంతోష్‌రెడ్డి, దివ్య శ్యామల దంపతులు.. ప్రగతినగర్‌లోని ఎన్‌ఆర్‌ఐ కాలనీలోని స్పెషియల్ గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లోని జీ3లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు మిథున్‌రెడ్డి నాలా వద్ద ఆడుకుంటున్నాడు.. అపార్ట్‌మెంట్ గేటు పక్కన ఉన్న మ్యాన్‌హోల్ మూత తీసి ఉండటంతో ప్రమాదవశాత్తూ నాలాలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు.. ఇద్దరు గజ ఈతగాళ్లను రప్పించి సీసీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు పడవల సాయంతో తుర్కచెరువులో వెతకగా.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు బాలుడు మిథున్‌రెడ్డి మృతదేహం లభించింది. బాలుడి పోస్టుమార్టం కోసం పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజు ఉదయం సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అధికారులు ప్రమాదానికి గల కారణాలను గుర్తించారు. మంగళవారం ఉదయం 8:20 గంటలకు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ మ్యాన్ హోల్ ఓపెన్ చేశాడు. రోడ్డుపై నిలిచిన వరదనీరు మళ్లించేందుకు కాలనీ అసోసియేషన్ ప్రతినిధి వాచ్‌మెన్‌తో మ్యాన్ హోల్ మూత తీయిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మూత పక్కకు తీసి మ్యాన్ హోల్ వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు నిర్ధారించారు.
Boy Died After Falling In Water Tank Mahabubabad : పండుగపూట విషాదం.. నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి
Auto Driver Killed by Falling Tree Live Video : ఆటోలపై కుప్పకూలిన భారీ వృక్షం.. డ్రైవర్ మృతి