మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని ప్రగతి నగర్లో నివాసం ఉండే ప్రభాకర్, రమాదేవి దంపతులు వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభాకర్‌కు భార్యపై అనుమానం కలగడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈరోజు మరోసారి వీరి మధ్య తగాదా జరగడంతో ఆవేశానికి లోనైన భర్త రాడ్డుతో భార్య తలపై బాదాడు. తీవ్ర రక్తస్రావంతో రమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త - husband
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త