మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్... మల్లికార్జున్ నగర్లో నివాసముండేవారు. వరంగల్‌కి చెందిన వీరు ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కి మకాం మార్చారు. గత 3 ఏళ్లుగా మల్కాజిగిరిలో ఉంటున్నారు. తరచుగా రఫీక్ కృష్ణవేణిని వేధించేవాడు. ఆ బాధలు భరించలేక... తన భర్త కులం పేరుతో దుషిస్తూ తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 498 సెక్షన్ క్రింద కేసును బుక్ చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రఫిక్ పరారీలో ఉన్నాడని సీఐ వెల్లడించారు.
మతం పేరుతో భర్త దూషణ.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. - మల్కాజిగిరి పోలీస్ స్టేషన్
వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకున్నాడు. తన భర్త మతం పేరుతో దూషిస్తున్నాడని ఆ ఇల్లాలు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మతం పేరుతో దూషించిన భర్త..కేసు నమోదు