చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కుషాయిగూడ సీఐ అధ్వర్యంలో పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి జైలులోనికి అనుమతిస్తున్నారు. వెటర్నరీ వైద్యురాలు హత్యాచారం కేసులోని నిందితులను చర్లపల్లి జైలుకు తరలించే సమయంలో విద్యార్థి సంఘాలు నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జైలు వద్ద ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది.
చర్లపల్లి కారాగారం వద్ద భారీ బందోబస్తు - shamshabad incident
దేశంలోనే సంచలనం రేపిన పశువైద్యురాలి హత్యాచార నిందితులను శనివారం చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చర్లపల్లి కారాగారం వద్ద భారీ బందోబస్తు