Boxer Nikhat Zareen: వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడలకు ఎంపికైన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌ను మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా సత్కరించారు. మేడ్చల్ జిల్లా దుందిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీలో ఆ సంస్థ ఛైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, మల్కాజిగిరి తెరాస పార్లమెంటరీ ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి తెలుగమ్మాయి నిఖత్‌కు జ్ఞాపికను అందజేశారు. నిఖత్ తమ కళాశాల ఎంబీఏ విద్యార్థి కావడం గర్వంగా ఉందన్న మర్రి రాజశేఖర్ రెడ్డి... పట్టుదల, కఠోర సాధన లేనిదే ఈ స్థాయికి రాలేరని తెలిపారు. నిఖత్‌ను ఆదర్శంగా తీసుకొని కళాశాల నుంచి మరింత మంది క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు.
Boxer Nikhat Zareen: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు సన్మానం - Indian Boxer Nikhat Zareen News
Boxer Nikhat Zareen: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌ను మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా సత్కరించారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడలకు ఎంపికైన నేపథ్యంలో ఘనంగా సత్కరించారు.
Boxer Nikhat Zareen
ఈనెల నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు నిఖత్‌కు కళాశాల తరఫున ప్రతినెల రూ. 20 వేలు నగదు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆమెకు అడ్వాన్స్‌డ్ కోచింగ్ తీసుకోవడానికి, శిక్షణ సంబంధిత ఇతరత్రా ఖర్చుల కోసం సాయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: