తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్​, తెదేపాలు మైనార్టీలకు సాయం చేయలేదు' - మున్సిపల్​ ఎన్నికలు

సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్​ వన్​గా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ అన్నారు.

home minister mahmood ali campaign for municipal elections in telangana 2020
'కాంగ్రెస్​, తెదేపాలు మైనార్టీలకు సాయం చేయలేదు'

By

Published : Jan 18, 2020, 10:43 AM IST

'కాంగ్రెస్​, తెదేపాలు మైనార్టీలకు సాయం చేయలేదు'
ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడ, ఘట్‌కేసర్​ పుర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తెలంగాణ రాకముందు అంధకారంలో బతికిన ప్రజలకు, 24 గంటల విద్యుత్తు సరఫరా చేసిన ఘనత కేసీఆర్​ సర్కాదేనని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాలు ఏనాడు మైనార్టీలకు సాయం చేయలేదని మండిపడ్డారు.

కారుగుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు హోంమంత్రి మహమూద్​ అలీ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details