తెలంగాణ

telangana

ETV Bharat / state

Illegal Constructions Demolition: అక్రమ నిర్మాణాలపై హెచ్​ఎండీఏ ఉక్కుపాదం - hyderabad metropolitan development authority

Illegal Constructions Demolition: భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హెచ్​ఎండీఏ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు 149 అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్​ఫోర్స్ చర్యలు చేపట్టింది. నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుని కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు.

Illegal Constructions Demolition: అక్రమ నిర్మాణాలపై హెచ్​ఎండీఏ ఉక్కుపాదం
Illegal Constructions Demolition: అక్రమ నిర్మాణాలపై హెచ్​ఎండీఏ ఉక్కుపాదం

By

Published : Feb 7, 2022, 7:46 PM IST

Illegal Constructions Demolition: అక్రమ నిర్మాణాలపై హెచ్​ఎండీఏ చర్యలు చేపడుతోంది. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్​కేసర్​లో హెచ్ఎండీఏ టాస్క్​ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఇవాళ నాలుగు అక్రమ నిర్మాణాల కూల్చివేయగా.. ఇప్పటి వరకు 149 అక్రమ నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. ఎన్ఎఫ్​సీ నగర్​లో రెండు అక్రమ నిర్మాణాలను, శివారెడ్డి గూడలో ఒక అక్రమ నిర్మాణాన్ని, ఘట్​కేసర్​లో మరొక అక్రమ నిర్మాణంపై టాస్క్​ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోని మున్సిపాలిటీలలో డిస్ట్రిక్ట్ టాస్క్​ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం 149 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది.

మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్​ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్​ఫోర్స్​మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా ఇవాళ 4 నిర్మాణాలను కూల్చివేశారు.

అక్రమ నిర్మాణాలపై హెచ్​ఎండీఏ ఉక్కుపాదం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details