తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం

మేడ్చల్​ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సూరారం తెలుగుతల్లినగర్‌లోని పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మల్కాజిగిరి, నేరెడ్​మేట్, కుషాయిగూడ, దమ్మాయిగూడాలో, జీడీమెట్ల, కుత్బుల్లాపూర్, గాజులరామరం, జగద్గిరిగుట్ట, చింతల్, కొంపల్లి, సూచిత్ర, దుండిగల్​లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

heavy rain in medchal malkaggiri district
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Sep 19, 2020, 3:51 PM IST

ఉపరితల ఆవర్తనంతో మేడ్చల్​ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మల్కాజిగిరి, నేరెడ్​మేట్, కుషాయిగూడ, దమ్మాయిగూడా, జీడీమెట్ల, కుత్బుల్లాపూర్, గాజులరామరం, జగద్గిరిగుట్ట, చింతల్, కొంపల్లి, సూచిత్ర, దుండిగల్​లో భారీ వర్షం పడింది.

సూరారంల తెలుగుతల్లినగర్‌లోని పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ABOUT THE AUTHOR

...view details