మేడ్చల్ జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షపు నీరుతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. స్థానికులకు, ఉద్యోగులకు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహం నదులను తలపించింది. తార్నాక నుంచి నాచారం, మల్లాపూర్ వరకు రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి.
మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులన్ని జలమయం కాగా.. పలు చోట్ల విద్యుత్ సమస్యలు తలెత్తాయి. స్థానికులు, ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం
రహదారుల్లో గుంతలు ఎక్కడున్నాయో తెలియక ద్విచక్ర వాహనాదారులు పడరాని పాట్లు పడ్డారు. సరకుల కోసం, ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో ప్రజలు తడిసి మద్దయ్యారు. అక్కడక్కడా విద్యుత్ సమస్యలు తలెత్తినట్లు స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..