విద్యార్థులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జి రాజశేఖర్ రెడ్డి, వీరా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన... విద్యార్థుల ఆరోగ్యకార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు.
'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ ధ్యేయం' - Medchal Student Health Cards Distribution
ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రణాళికా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. మేడ్చల్ బాలుర పాఠశాలలో మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన విద్యార్థులకు ఆరోగ్యకార్డులను పంపిణీ చేశారు.
!['ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ ధ్యేయం' Vinod Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6104190-221-6104190-1581939779254.jpg)
Vinod Kumar
ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని... ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని విద్యార్థులకు ఆరోగ్య సూచిక తయారు చేయడం మంచి పరిణామం అని చెప్పారు. ఇదే పద్ధతి రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేలా చూస్తామన్నారు. నిర్వాహకులను ఆయన అభినందించారు. విద్యార్థులు ఎక్కడికెళ్లినా ఈ కార్డుతో వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ ధ్యేయం