జాతీయ రహదారుల డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్ పోస్టు వద్ద ఎన్ఎచ్ 44 జాతీయ రహదారి విభాగినిపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారులపై పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.
'జాతీయ రహదారుల డివైడర్లపై మొక్కలు నాటుతున్నాం' - harithaharam latest news
ఆరో విడత హరితహారంలో భాగంగా జాతీయ రహదారుల డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమం ఆయా మున్సిపాలిటీలు, జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్ పోస్టు వద్ద ఎన్ఎచ్ 44 జాతీయ రహదారి డివైడర్లపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మొక్కలు నాటారు.
'జాతీయ రహదారుల విభాగినులపై మొక్కలు నాటుతున్నాం'