తెలంగాణ

telangana

ETV Bharat / state

'వృద్ధి రేటులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం' - సురభి వాణీదేవి

వృద్ధి రేటులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం ఇంధన, గ్యాస్ ధరలు పెంచడంతో నిత్యవసర ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

harish-rao-said-state-ranks-first-in-country-in-growth-rate
'వృద్ధి రేటులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం'

By

Published : Feb 27, 2021, 8:55 PM IST

భాజపా, కాంగ్రెస్​పై మంత్రి హరీశ్​ రావు విమర్శలు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నేతలు ఎన్ని ఇచ్చారో చెప్పాలని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెరాస సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఇంధన, గ్యాస్ ధరలు పెంచడం వలన నిత్యవసర ధరలు పెరుగుతున్నాయని హరీశ్​ రావు అన్నారు. తెరాస బలపరిచిన అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు. రాష్ట్రం వృద్ధి రేటులో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఆగిందన్నారు. త్వరలోనే ఆ నోటిఫికేషన్ రాబోతుందని వెల్లడించారు.

ఇదీ చూడండి :జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం... ఫోన్లలో అభ్యర్థుల ప్రసన్నం

ABOUT THE AUTHOR

...view details