Minister Harish Rao on Tribal Welfare in Telangana : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పదేళ్లు వెనక్కి పోతుందని మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గిరిజనులకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. 2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి (Congress) వస్తే తండాలని పంచాయతీలుగా మారుస్తామని చెప్పి.. మాట మార్చారని మండిపడ్డారు. కానీ వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను పంచాయతీలుగా మార్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందుకు గిరిజనులు తాగు నీరు లేకుండా ఇబ్బందులు పడ్డరోజులున్నాయని.. ఇప్పులు ప్రతి మారుమూల గ్రామానికి కూడా తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. హస్తం నాయకులు అధికారంలో ఉన్నప్పుడు కనీసం తండాలకు రోడ్లు కూడా లేవని మండిపడ్డారు.
సమైక్యవాది పవన్ కల్యాణ్‌తో ఈటల రాజేందర్ ఎలా కలుస్తారు : మంత్రి హరీశ్‌రావు
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రభుత్వం గిరిజనులకు 4 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ కళాశాలలను నిర్మించామని తెలిపారు. వారు విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్లో స్కాలర్షిప్ ద్వారా ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల సహాయం అందిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సేవలాల్, కొమురం భీం జయంతి, సమ్మక్క-సారక్క పండుగలను అధికారికంగా బడ్జెట్ కేటాయించి మరీ జరుపుతుందని చెప్పారు.
"కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా చేశారు. గిరిజన బిడ్డలకు 10శాతం రిజర్వేషన్ కల్పించారు. 4లక్షల ఏకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. రైతు బంధు, ఉచిత కరెంటు ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజన బంధు, లక్ష ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తాం."- హరీశ్‌రావు, బీఆర్ఎస్ మంత్రి