తెలంగాణ

telangana

ETV Bharat / state

హ్యాండ్​ బాల్​ పోటీలు ప్రారంభించిన మంత్రి

మేడ్చల్ జిల్లా దుండిగల్ మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో హ్యాండ్​ బాల్​ పోటీలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ ఒక్కటే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

హ్యాండ్​ బాల్

By

Published : May 26, 2019, 11:20 AM IST

దేశంలో తెలంగాణ ఒక్కటే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మొదటి ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్-15 బాయ్స్ హ్యాండ్​ బాల్ ఛాంపియన్ షిప్-2019 క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం 2% రిజర్వేషన్ కల్పించామన్నారు మంత్రి శ్రీనివాస్​ గౌడ్. హ్యాండ్ బాల్ భారతదేశంలో అధిక ప్రాచుర్యం పొందుతుందని జాతీయ హ్యాండ్​ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రమేష్ బ్రని అన్నారు. క్రీడాకారులకు సరైన శిక్షణ ఉంటే జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ పోటీలు నేటి నుంచి 29వ వరకు జరుగనున్నాయి. క్వార్టర్, సెమీఫైనల్స్, ఫైనల్స్​లో గెలిచిన వారికి బహుమతులు ఇస్తామని తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. పోటీల్లో 13 రాష్ట్రాల నుంచి 45 జట్లు పాల్గొన్నాయి.

హ్యాండ్​ బాల్​ పోటీలు ప్రారంభించిన మంత్రి
ఇవీ చూడండి: ప్రత్యేక హోదాకు సంపూర్ణ మద్దతు

ABOUT THE AUTHOR

...view details