మేడ్చల్ మండలం గిర్మాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అదనపు బోధన సిబ్బందిని నియమించాల్సింది పోయి... ఉన్నవారిని అక్రమంగా బదిలీలు చేస్తున్నారని ధర్నా చేశారు. ఇప్పటికే ఒక్కో అధ్యాపకుడు రెండు సబ్జెక్ట్‌లు బోధిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వానికి, ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆందోళన బాట పట్టారు. వీరికి ఎస్ఏఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు.
బోధన సిబ్బంది బదిలీలపై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన - GOVT POLYTECHNIC COLLEGE STUDENTS PROTEST IN MEDCHAL DISTRICT
తమ కళాశాలలో బోధన సిబ్బంది బదిలీలపై మేడ్చల్ గిర్మాపూర పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
![బోధన సిబ్బంది బదిలీలపై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3997539-121-3997539-1564560159608.jpg)
బోధన సిబ్బంది బదిలీలపై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
బోధన సిబ్బంది బదిలీలపై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు