తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ భూమి కబ్జా.. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు - ప్రభుత్వ భూమి కబ్జా తాజా వార్తలు

మేడ్చల్ జిల్లా దేవేందర్‌ నగర్‌లో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమిని జేసీబీతో చదును చేయించి.. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వెంటనే తొలగించలేమని.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ గౌరివత్సల తెలిపారు.

ప్రభుత్వ భూమి కబ్జా.. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు
ప్రభుత్వ భూమి కబ్జా.. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు

By

Published : Jul 1, 2020, 5:16 PM IST

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధి దేవేందర్ నగర్‌లోని సర్వే నెం. 329/1లో పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులోని ఆరు ఎకరాలు వాటర్ బోర్డు వారు తీసుకోగా మిగతా భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. కొంత భూమిని జేసీబీతో చదును చేసి.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

వీఆర్వోను ఘటనాస్థలికి పంపించిన రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వెంటనే తొలగించలేమని కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌ గౌరివత్సల తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ABOUT THE AUTHOR

...view details