మేడ్చల్ జిల్లా కేసీఆర్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. జీవనాధార వాటర్ ప్లాంట్ సంపులో పడి ఓ తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. సంపులో చేపలున్నాయన్న సమాచారంతో బాలుడు అందులోకి దిగాడు. ఈత రాకపోవడం, లోతు ఎక్కువ ఉండడం వల్ల అతను మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు.
చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడు మృతి - పిల్లలు ఆటలు
కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక పిల్లలు ఆటలకు అడ్డూ అదుపు లేదు. ఈ నేపథ్యంలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు చేపలు పట్టేందుకు సంపులో దిగి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.
చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడు మృతి
పిల్లాడి మరణంతో కేసీఆర్ నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు అశ్విని-నరసింహ దంపతుల కుమారుడిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి :తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో మళ్లీ లొల్లి