మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేశ్ కుమార్ పర్యటించారు. 40 కోట్ల రూపాయలతో చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు.
'నాలా మళ్లింపే ముంపునకు శాశ్వత పరిష్కారం' - ghmc commissioner lokesh kumar visited Malkajgiri
మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో వరద ముంపును నివారించడానికి బండచెరువు నుంచి వచ్చే నాలాను 2 కిలోమీటర్ల దూరం మళ్లిస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
'నాలా మళ్లింపే ముంపునకు శాశ్వత పరిష్కారం'
ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో వరద ముంపు నివారణకు బండచెరువు నుంచి వచ్చే నాలాను 2 కిలోమీటర్ల దూరం మళ్లిస్తామని బొంతు రామ్మోహన్ తెలిపారు. బండచెరువు నుంచి వస్తోన్న వరద నీటితో ఈస్ట్ ఆనంద్ బాగ్‌లోని పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయని... రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. ఈ సమస్యకు నాలా మళ్లింపు, విస్తరణే శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి:-కీలక డిమాండ్‌తో సత్య నాదెళ్లకు ఉద్యోగుల లేఖ