తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి దంపతులు - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020 లేటెస్ట్ న్యూస్

బల్దియా ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉప్పల్ పరిధిలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి దంపతులు ఓటేశారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ghmc elections polling in uppal
ఓటేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి దంపతులు

By

Published : Dec 1, 2020, 10:13 AM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా ఉప్పల్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. హబ్సిగూడ, చిలకనగర్, రామంతపూర్, ఉప్పల్ డివిజన్ల పరిధిలో ప్రధాన పార్టీలతో పాటు రెండు చోట్ల తెదేపా పోటీ చేస్తోంది. హబ్సిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి, ఆయన సతీమణి తెరాస అభ్యర్థి స్వప్న తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులతో నియోజవర్గంలో 10 స్థానాలు గెలుపు పొందుతామని సుభాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

4 డివిజన్ల పరిధిలో మొత్తం ఓటర్లు...

  • పురుష ఓటర్లు- 1,04,251 మంది
  • మహిళా ఓటర్లు- 94,916 మంది

ఇదీ చదవండి:9గంటల వరకు 3.10శాతం పోలింగ్ నమోదు

ABOUT THE AUTHOR

...view details