Gas pipeline leakage: మేడ్చల్ జిల్లా సురారం బస్‌స్టాప్ వద్ద గ్యాస్ పైపు లైన్ లీకేజీ అయ్యింది. బస్‌స్టాప్ వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పుట్‌పాత్ పనులు జరుగుతున్నాయి. జేసీబీ సహాయంతో జరుగుతున్న పనుల్లో భూమిలో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైపు లైన్ పగిలింది. పెద్ద ఎత్తున శబ్దంతో గ్యాస్ లీకేజీ కావడంతో అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. ప్రధాన లైన్ కావడంతో సమాచారం అందుకున్న సంబంధిత సిబ్బంది గ్యాస్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లాలో గ్యాస్ పైపు లైన్ లీకేజీ కలకలం - హైదరాబాద్ తాజా వార్తలు
Gas pipeline leakage: మేడ్చల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పుట్‌పాత్ పనులు చేపడుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ పైపు లైన్ పగిలింది. దీంతో అక్కడి వారు భయంతో పరుగులు తీశారు.
గ్యాస్ పైపు లైన్ లీకేజీ