మేడ్చల్ జిల్లా కేంద్రంలోని రాజాబొల్లారం తండాలో గ్యాస్‌సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చి కిరాణా దుకాణం నడుపుతున్నా వ్యక్తి అక్రమంగా చిన్న సిలిండర్‌లో గ్యాస్ నింపుతూ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌లోకి గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకుని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఇంట్లో ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. దీనితో ఇంట్లో ఉన్న ఐదు సిలిండర్లు పేలాయి. గ్రామంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. తుర్కపల్లి ఫైర్ స్టేషన్ నుంచి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో స్వామి మనుమరాలు హన్సికకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో పేలిన 5 సిలిండర్లు... తప్పిన పెనుప్రమాదం - gas cylinder blast in home
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ పేలింది. దీనితో ఇళ్లంతా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని రాజాబొల్లారం తండాలో చేసుకుంది.
మేడ్చల్‌లో ఓ ఇంట్లో పేలిన సిలిండర్
ఇదీ చూడండి:'ఆర్థిక మందగమనానికి జీఎస్టీనే కారణం'