హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో వినాయక నిమజ్జనాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన నిమజ్జనోత్సవం నగర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ మాత్రం సాయంత్రం నుంచి విగ్రహాల తాకిడి పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి పరిధిలోని నాలుగు చెరువులు, రెండు కోనేరుల వద్ద అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Kukatpally: కూకట్‌పల్లిలో మందకొడిగా నిమజ్జనం.. సాయంత్రం రద్దీ పెరిగే అవకాశం
నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని చెరువుల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కూకట్‌పల్లి పరిధిలో గణనాథుని నిమజ్జనాలు మందకొడిగా కొనసాగుతున్నాయి. సాయంత్రం నుంచి భారీ విగ్రహాల తాకిడి పెరిగే అవకాశం ఉంది.
ఇవాళ ఉదయం నుంచి చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే చెరువు వద్దకు వస్తున్నాయి. సాయంత్రానికి భారీ విగ్రహాల రాక మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. నిమజ్జనోత్సవం వీక్షించేందుకు సాయంత్రం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఐడీఎల్ చెరువు వద్ద ఏడు క్రేన్లు, అంబీర్ చెరువు వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐడీఎల్ చెరువు కట్ట వద్ద సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేశారు.. ఇప్పటికే చెరువు కట్ట దారిలో వాహనాలను మూసాపేట్ వైపు నుంచి కేపీహెచ్‌బీ నుంచి దారి మళ్లించారు.
ఇదీ చూడండి:Khairatabad Ganesh: జలప్రవేశం చేసిన ఖైరతాబాద్ మహారుద్ర గణపతి