మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి చెక్ పోస్టు సమీపంలోని ఓ వెంచర్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మేడ్చల్ పట్టణానికి చెందిన దిలీప్(26)పై తన స్నేహితుడు శంకర్ పాత కక్షలతో ఫోన్ చేసి ఓ ప్రాంతానికి రమ్మని ఆపై కత్తితో దాడి చేశాడు.
ఫోన్ చేసి రమ్మని కత్తితో దాడి చేసిన స్నేహితుడు? - medchal district today news
నమ్మిన స్నేహితుడే... పాత కక్షలను మనసులో ఉంచుకుని పగ తీర్చుకున్నాడు.. అదును చూసి అటాక్ చేశాడు. ఆదివారం అర్ధరాత్రి కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఫోన్ చేసి రమ్మని కత్తితో దాడి చేసిన స్నేహితుడు?
ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఎందుకు దాడి చేశాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
ఫోన్ చేసి రమ్మని కత్తితో దాడి చేసిన స్నేహితుడు?
ఇదీ చూడండి :ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్