తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి రేపు ఫ్రీ బిడ్ సమావేశం - మేడ్చల్​లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్​షిప్​ల పరిధిలో నిర్మాణంలో ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు రేపు ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 30వ తేదీ నాటికి రూ. 10 లక్షలు ధరావత్తును చెల్లించాలని పేర్కొన్నారు. ఫ్లాట్ల కేటాయింపు పారదర్శకంగా లాటరీ విధానంలో ఉంటుందని స్పష్టం చేశారు.

Rajiv Swagriha Flats
Rajiv Swagriha Flats

By

Published : Jan 8, 2023, 6:41 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్​ల పరిధిలో నిర్మాణంలో ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ ప్రకటించింది. దీనిలో భాగంగా రేపు హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్ ఉర్దూగల్లీలో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాల్​లో ఈ ఫ్రీ బిడ్ సమావేశానికి హెచ్​ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు.

పోచారంలో 9 అంతస్థుల నాలుగు 4 టవర్లు ఉండగా.. వాటిల్లో ఒక్కొక్క టవర్​లో కనీసం 72 నుంచి 198 ఫ్లాట్​లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదే విధంగా గాజుల రామారంలో 14 అంతస్థుల ఐదు 5 టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్​లో 112 ప్లాట్​లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్​కు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి గల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు ఈ నెల 30 నాటికి రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ధరావత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని.. లాటరీ విధానం ద్వారా టవర్లను వారికి కేటాయిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details