తెలంగాణ

telangana

ETV Bharat / state

foundation stone to Kandlakoya IT Park: కండ్లకోయ ఐటీ పార్కుకు నేడు శంకుస్థాపన - Kandlakoya IT Park latest news

foundation stone to Kandlakoya IT Park: మేడ్చల్​ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కండ్లకోయ కూడలికి సమీపంలో వచ్చే ఈ ఐటీ పార్కును 10 ఎకరాల్లో టీఎస్​ఐఐసీ అభివృద్ధి చేయనుంది.

కండ్లకోయ ఐటీ పార్కుకు నేడు శంకుస్థాపన
కండ్లకోయ ఐటీ పార్కుకు నేడు శంకుస్థాపన

By

Published : Feb 17, 2022, 5:12 AM IST

foundation stone to Kandlakoya IT Park: హైదరాబాద్ నలువైపులా ఐటీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ పార్క్అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేయనున్న పార్కుకు మంత్రి కేటీఆర్​ నేడు శంకుస్థాపన చేయనున్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ కూడలికి సమీపంలో వచ్చే ఈ ఐటీ పార్కును 10 ఎకరాల్లో టీఎస్​ఐఐసీ అభివృద్ధి చేయనుంది.

ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు.. అక్కడ నూతన కార్యాలయాలు తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఐటీ పార్కు ద్వారా స్థానికంగా 50 వేల మందికి ఉపాధి లభించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: TELANGANA GATE WAY: కండ్లకోయలో రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్కు

ABOUT THE AUTHOR

...view details