కార్పోరేట్ ఆసుపత్రులు.. కరోనా పేషేంట్ల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటోన్నా.. ప్రభుత్వం కనీసం స్పందించడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత కూన శ్రీశైలం గౌడ్ మండిపడ్డారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి.. ఆయా హాస్పిటల్స్‌లో వైద్యాన్ని ఉచితంగా అందించాలని కోరారు. మేడ్చల్ జిల్లాలోని షాపూర్ నగర్ పీహెచ్‌సీతో పాటు కుత్బుల్లాపూర్‌లోని పలు కొవిడ్ పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు.
'కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి' - ex mla koona srishaialm goud
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటించారు. షాపూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పలు కొవిడ్ పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. బాధితులకు అందించే సేవల గురించి.. వైద్యులను అడిగి తెలుసుకున్నారు
!['కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి' Former MLA Koona Srisailam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:22:55:1621317175-tg-hyd-49-17-exmla-visit-health-centers-given-hope-av-ts10011-17052021182956-1705f-1621256396-659.jpg)
Former MLA Koona Srisailam
కేంద్రాల్లో బాధితులకు అందించే సేవల గురించి.. శ్రీశైలం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ పంపిణీల గురించి వారితో చర్చించారు. ఇబ్బందుల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో