మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో 70 ఎకరాలలో నిర్మించిన నాగరం ఆరోగ్య వనాన్ని రాష్ట్ర అటవీ, కార్మిక శాఖ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. దాదాపుగా రూ.80 లక్షలతో పార్కు ఏర్పాటు చేశామని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. స్థానికులకు కాలినడకకు ఉపయోగపడటంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతుందని తెలిపారు. రెండవసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల అడవులన్నీ పార్కులుగా మారాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
'కేసీఆర్‌తోనే అడవులు పార్కులుగా మారాయి' - దమ్మాయిగూడ
మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో 70 ఎకరాలలో నిర్మించిన నాగరం ఆరోగ్య వనాన్ని రాష్ట్ర అటవీ, కార్మిక శాఖ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు.
'కేసీఆర్‌తోనే అడవులు పార్కులుగా మారాయి'