మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో లవ్‌జిహాది ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్న భర్త ఆరేళ్ల తర్వాత తనను చిత్రహింసలు పెడుతూ ఇంటి నుంచి వెళ్లగొడుతున్నాడని ఓ మహిళ ఠాణాలో ఫిర్యాదు చేసింది. స్థానిక మల్లిఖార్జున నగర్లో నివాసముండే క్రిష్ణవేణి అలియాస్ షబానాకు... రఫీక్ అనే వ్యక్తి ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. మలక్‌పేట్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవారు. పెళ్లి సమయంలో అమ్మాయి హిందువు అవడం వల్ల ఇరువైపుల పెద్దలు అంగీకరించలేదు. మతం మారితేనే వివాహం చేస్తామని వరుడి తల్లిదండ్రులు చెప్పడం వల్ల మత మార్పిడి చేసి పెళ్లి చేశారు. అనంతరం షబానాకు నాలుగు సార్లు గర్భస్రావం అయింది. పిల్లలు లేకపోవడం, కట్నం ఇవ్వలేదని భర్త వేధింపులు మొదలెట్టాడు. ఇప్పుడు తనకు ఎటువంటి సంబంధం లేదంటూ... ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు చిత్రహింసలు పెడుతున్నాడని... తనకు ఎలాగైనా న్యాయం చేయాలని వేడుకుంటుంది బాధిత మహిళ.
పెళ్లి కోసం మతం మార్చాడు... పిల్లలు లేరని వెళ్లిపోమ్మంటున్నాడు
ప్రేమ పేరుతో ఓ యువతిని బలవంతంగా మతమార్పిడి చేయించి వివాహం చేసుకున్నాడో వ్యక్తి. ఆరేళ్లు కాపురం చేసిన తర్వాత పిల్లలు కలగడం లేదని, కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఎలాగైన వదిలించుకోవాలని తల్లదండ్రులతో కలిసి హింసించాడు. తనకు న్యాయం చేయాలంటూ యువతి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెళ్లి కోసం మతం మార్చాడు... పిల్లలు లేరని వెళ్లిపోమ్మంటున్నాడు