తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో కొనసాగుతున్న ఇంటింటి ఫీవర్​ సర్వే

రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్​ సర్వే కొనసాగుతోంది. మేడ్చల్​ జిల్లాలోని ఘట్‌కేసర్‌, పోచారం, బోడుప్పల్‌, పిర్జాదిగూడ, ఉప్పల్‌, రామంతాపూర్​లో మున్సిపల్, ఆరోగ్య సిబ్బంది సర్వే చేస్తున్నారు.

ఇంటింటి ఫీవర్​ సర్వే
ఇంటింటి ఫీవర్​ సర్వే

By

Published : May 13, 2021, 3:11 PM IST

మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్‌, పోచారం, బోడుప్పల్‌, పిర్జాదిగూడ, ఉప్పల్‌, రామంతాపూర్​లో ఇంటింటి ఫీవర్​ సర్వే నిర్వహిస్తున్నారు. మున్సిపల్​, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి.. ఆ ఇంట్లోని వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు.

జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, ఇతరత్రా సమస్యలు ఆరా తీస్తున్నారు. అనుమానితులకు అప్పటికప్పుడు మెడికల్‌ కిట్లు అందజేస్తున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌

ABOUT THE AUTHOR

...view details