సీలింగ్ ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం - fire accidents updates
09:24 May 28
సీలింగ్ ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
మేడ్చల్ జిల్లా యాష్ ఫ్యాన్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాలానగర్ రంగారెడ్డి నగర్‌లోని పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఫ్యాన్ల పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ.. సుమారు మూడు కిలోమీటర్లకుపైగా వ్యాపించింది. ఘటనాస్థలిలో చేరుకున్న సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. పరిశ్రమలోని ఫ్యాన్ల సామగ్రిని తరలిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి:'బోరు'న పొంగిన దుఃఖం.. బాలుడి కథ విషాదాంతం