చర్లపల్లిలో అగ్ని ప్రమాదం - charlapally
చర్లపల్లి పారిశ్రామికవాడలో ఎస్‌ఈఆర్ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అగ్నిమాపక వాహనాలు అగ్నికీలలను అదుపులోకి తెచ్చాయి.
చర్లపల్లిలో అగ్ని ప్రమాదం
చర్లపల్లి పారిశ్రామికవాడలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఈఆర్ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక వాహనాలతో కర్మాగరంలో ఎగిసిపడిన అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.