Fire At Thumukunta Dumping Yard: హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై కమ్మేసిన పొగ - fog at hyderabad karimnagar road
14:55 December 30
మేడ్చల్ జిల్లా తూముకుంట డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం
Fire At Thumukunta Dumping Yard: మేడ్చల్ జిల్లా తూముకుంట డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. ఫలితంగా హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై కి.మీ మేర పొగ కమ్మేసింది. పొగతో ముందున్న వాహనాలు కనిపించక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు తమ వాహనాల నుంచి కిందికి దిగి దారి చూపుతున్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యంపై వాహనదారులు మండిపడుతున్నారు.
మంటలు ఆర్పేందుకు రెండు నీటి ట్యాంకర్లతో తూముకుంట మున్సిపాలిటీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. 2 గంటలుగా శ్రమిస్తున్నా ఫలితం లేదని మున్సిపాలిటీ సిబ్బంది చెబుతున్నారు. అగ్నిమాపక శకటాలు వస్తేనే మంటలు అదుపులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
ఇదీచూడండి:CCTV Video: ఘోర రోడ్డు ప్రమాదం... లక్కీగా ఆ ముగ్గురు సేఫ్!