తెలంగాణ

telangana

ETV Bharat / state

జీడిమెట్లలో అగ్నిప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు పరిశ్రమలో విద్యుదాఘాతం కారణంగా పలు యంత్రాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

అగ్నిప్రమాదం

By

Published : Feb 24, 2019, 12:55 PM IST

అగ్నిప్రమాదం
మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేపర్​ ముద్రణ యంత్రం, పేపర్​ రోల్స్​ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపుచేశారు. విద్యుదాఘాతం కారణమని అధికారులు భావిస్తున్నారు. సుమారు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఘటన ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details