తెలంగాణ

telangana

ETV Bharat / state

అట్టల పరిశ్రమలో అగ్ని ప్రమాదం - gatkesar

ఘట్​కేసర్​ ఠాణా పరిధిలోని ఓ అట్టల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడిన మంటల్లో డీసీఎం వాహనం అగ్నికి ఆహుతయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

fire-accident-in-gatkesar

By

Published : May 10, 2019, 4:40 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఏదులబాద్​లో ఓ అట్టల పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో ఓ డీసీఎం వాహనం అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.5 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

అట్టల పరిశ్రమలో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details