రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం.. కారణాలపై ఆరా - fire accident at Rubber factory

రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం.. కారణాలపై ఆరా
17:16 August 02
రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం.. కారణాలపై ఆరా
రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న పొగలు
మేడ్చల్ జిల్లా నాచారం పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. రోడ్ నంబర్ 8లో ఉన్న రబ్బర్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు శకటాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. సుమారు 4 గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఆస్తి నష్టం భారీగానే జరిగిందని కంపెనీ యజమాని ముప్పాదల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.
Last Updated : Aug 2, 2020, 10:56 PM IST