తెలంగాణ

telangana

ETV Bharat / state

షార్ట్​ సర్క్యూట్​తో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించగా.. కెమికల్​ డబ్బాలు కాలిపోయాయి. దీంతో ఘాటైన వాసనతోపాటు పొగ రావడాన్ని గమనించిన ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

షార్ట్​ సర్క్యూట్​తో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
షార్ట్​ సర్క్యూట్​తో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

By

Published : May 20, 2020, 11:44 PM IST

షార్ట్​ సర్క్యూట్​తో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎంఎస్ రసాయన పరిశ్రమ గోడౌన్​లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్వల్ప మంటలతో పొగ రావడం వల్ల గమనించిన ఉద్యోగులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫైర్​ ఇంజిన్​తో మంటలను అదుపులోకి తెచ్చారు.

షార్ట్​ సర్క్యూట్​తో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

"గోడౌన్​లో హలోజిన్ బల్బు పేలడం వల్ల షార్ట్ సర్క్యూటై యాంటీ ఫంగల్ ఏజెంట్ అయిన ఇట్ర కనజోల్ అనే ఇంటర్మీడియట్ డ్రగ్ కెమికల్ డబ్బాలు అంటుకొని కాలిపోయాయి. సుమారు మూడు లక్షల విలువ గల సామగ్రి కాలిపోయింది. ఈ రసాయనం సీజనల్ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదు."

-సుభాష్​ రెడ్డి, జీడిమెట్ల ఫైర్ అధికారి

ఇదీ చూడండి :పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే

ABOUT THE AUTHOR

...view details