తెలంగాణ

telangana

ETV Bharat / state

కబడ్డీ ఆడుతూ కింద పడ్డ మంత్రి మల్లారెడ్డి - boduppal kabaddi news

మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్లో కబడ్డీ ఆడుతూ మంత్రి మల్లారెడ్డి కాలు జారి కింద పడ్డారు. మంత్రికి అదృష్టవశాత్తు గాయాలు కాలేదు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డిలు హాజరయ్యారు.

minister Mallareddy news, playing kabaddi at boduppal
కబడ్డీ ఆడుతూ కింద పడ్డ మంత్రి మల్లారెడ్డి

By

Published : Mar 30, 2021, 10:46 PM IST

కబడ్డీ ఆడుతూ కింద పడ్డ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు స్థానిక తెరాస నేతలతో కలిసి సరాదాగా కబడ్డీ ఆడుతూ మంత్రి మల్లారెడ్డి కాలు జారి కింద పడ్డారు.

తక్షణం స్పందించిన నాయకులంతా కిందపడ్డ అమాత్యుడిని లేపారు. ఐతే మంత్రికి ఏలాంటి గాయాలు కాలేదు. అనంతరం ప్రారంభోత్సవంలో క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రులు పేర్కొన్నారు. గ్రామీణ యువత క్రీడలపట్ల ఆసక్తి చూపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి :ఆ చారిత్రక కట్టడాల నిర్వహణపై హైకోర్టు అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details