కరోనాతో మరణించిన వారిని తరలించడానికి ఫీడ్ ద నీడ్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. మానవతా దృక్పథంతో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ 'లాస్ట్ జర్నీ' సేవలను ప్రారంభించారు.
ఫీడ్ ద నీడ్ వారి 'ది లాస్ట్ జర్నీ' అంబులెన్స్ - కరోనా మరణించిన వారిని తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్
'ఫీడ్ ద నీడ్' అనే స్వచ్ఛంద సంస్థ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది. కరోనాతో మరణించిన వారిని తరలించేందుకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అంబులెన్స్ సేవలను ప్రారంభించారు.
ఫీడ్ ద నీడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అభినందిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్
మంచిపని చేసేందుకు ముందుకొచ్చిన ఫీడ్ ద నీడ్ సంస్థ వారికి సీపీ ధన్యవాదాలు తెలిపారు. గతేడాది ప్రారంభించిన అంబులెన్స్ సేవలను మళ్లీ కేసులు పెరుగుతున్నందున పునరుద్ధరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరికైనా సేవలు కావాలంటే రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్లు 9490617234, 7995404040 ను సంప్రదించవచ్చని సీపీ మహేశ్ భగవత్ సూచించారు.