తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్క తప్పు.. తండ్రి, కొడుకులు జైలు పాలు

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనం నడపడమే కాదు.. లైసెన్స్ లేని వారికి వాహనం ఇవ్వడం కూడా నేరమేనని పోలీసులు పదే పదే చెబుతున్నారు. జనాలవేమీ పట్టించుకోకుండా.. కొడుకు అలిగాడనో, కూతురు అడిగిందనో కాద‌న‌లేక నిబంధనలకు విరుద్ధంగా.. వాహనాలు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత కష్టాల్లో పడుతున్నారు. ఇలాగే మేడ్చల్​ జిల్లాలో.. ఓ వ్యక్తి చేసిన నేరానికి అతనితో పాటు తన తండ్రి కటకటాల పాలయ్యాడు.

father arrested along with his son in a accident case in medchal
ఓ తప్పు.. తండ్రి, కొడుకులు జైలుపాలు

By

Published : Mar 2, 2021, 11:02 PM IST

ద్విచక్రవాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితుడితో పాటు.. అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్​లో జరిగింది.

సురారం కాలనీలో గత ఆదివారం సోము జగదీశ్​ (19) అనే వ్యక్తి తన తండ్రి బైక్​తో బయటకి వెళ్లాడు. వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ రఘునాథ్(50) అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు.. చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడికి డ్రైవింగ్​ లైసెన్స్ కూడా లేదని తేల్చారు. మృతికి కారణమైనందుకు అతన్ని, వాహనం ఇచ్చినందుకు అతని తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:క్రైం కథలు: బీమా ఏజెంట్ల దారుణాలు... విస్తుపోయే నిజాలు

ABOUT THE AUTHOR

...view details