పింఛనుదారుల కోసం వినియోగిస్తున్న ఫేషియర్ రికగ్నిషన్ పరిజ్ఞానం ద్వారా ఓటర్ల గుర్తింపును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కొంపల్లి పురపాలక సంస్థలోని పది పోలింగ్ కేంద్రాల్లో పైలట్ పద్ధతిన ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొంపల్లిలోని 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 పోలింగ్ కేంద్రాలను ఇందుకు ఎంపిక చేశారు.
టీఎస్టీఎస్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఓటర్లను గుర్తిస్తారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి రాగానే మొబైల్ లోని యాప్ సాయంతో గుర్తింపు ప్రక్రియ చేపడతారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలోని ఫొటోలను అప్పటికే యాప్‌తో అనుసంధానిస్తారు. ఓటరు ఫొటోను, జాబితాలోని ఫొటోను యాప్ పరిశీలిస్తుంది. ఫొటో సరిపోతే గుర్తించినట్లు సందేశాన్ని ఇస్తుంది.
ముఖాన్ని గుర్తించకపోతే...?