జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. జీవికా లైఫ్ సైన్సెన్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి 500 మీటర్ల వరకూ కంపెనీ శకలాలు ఎగిసిపడ్డాయి. స్థానికులు, పక్క కంపెనీల వాళ్లు భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఆరుగురు కార్మికులు విధుల్లో ఉన్నట్లు కంపెనీ ఉద్యోగులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న అన్వర్‌ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం అన్వర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబరీష్ అనే మరో అమ్రిష్ దాసు అనే కార్మికుడు శిథిలాల మధ్య చిక్కుకుని మరణించగా.. గాయపడిన మరో ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు కార్మికులు బిహార్‌కి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.