మేడ్చల్ జిల్లా అల్వాల్ ఖనాజిగూడలో ఆబ్కారీ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్కు ముందు సీజ్ చేసిన మద్యం దుకాణాల్లో అధికారులు మద్యం నిల్వలు పరిశీలించారు. ఓ వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటే.. కొంతమంది అధికారుల ముందే మద్యం బాటిళ్లు తరలించారు. అధికారులు సైతం.. ఈ తతంగాన్ని చూసీ చూడనట్టు వదిలేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆబ్కారీ పోలీసుల ముందే మద్యం తీసుకెళ్లారు - Exice police checking Wine Shop
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు మద్యం షాపుల్లో ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు మేడ్చల్ జిల్లాలోని అల్వాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆబ్కారీ పోలీసుల ముందే మద్యం తీసుకెళ్లారు