మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో అతిపురాతన రామలింగేశ్వర దేవాలయాన్ని జైనులు, కాకతీయుల హయాంలో నిర్మించారు. అప్పట్లో నిర్మించిన ఈ దేవాలయాన్ని గుప్తనిధుల కోసం కొందరు తవ్వారంటూ ఫిర్యాదులు రాగా.. రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించారు.
కీసరగుట్ట ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయా? - Are there any treasures in the Keesara temple?
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అతిపురాతనమైన కీసరగుట్ట రామలింగేశ్వర దేవాలయాన్ని గుప్తనిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వారంటూ ఫిర్యాదులు రాగా.. రెవెన్యూ అధికారులు ఆలయం వద్ద పరిశీలించారు.
కీసరగుట్ట ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయా?
కీసరగుట్ట ఆలయంలో రాత్రి వేళల్లో గుర్తుతెలియని దుండగులు కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయలతో పూజలు చేసి తవ్వకాలు చేపట్టినట్లు ఆనవాలు కనిపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయమై కీసర పోలీసులను అడగగా తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు.