ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వేగంగా స్పందించే పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ... సరైన అవగాహన లేక అమ్మాయిలు ప్రమాదంలో చిక్కుకుంటున్నారని ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఎదులాబాద్లోని మెగా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఈటీవీ భారత్, ఈనాడు, ఫెస్టివ్ ఫోక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోటోల్ ఫ్రీ నెంబర్లపై అవగాహన సదస్సు నిర్వహించారు.
మహిళలు తీసుకోవాల్సిన స్వీయ రక్షణ చర్యలపై అవగాహన సదస్సు - Etv Eenadu Sadasu
ఒంటరిగా ప్రయాణించే మహిళలు, యువతులు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి సూచించారు. మేఘా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో మహిళలు తీసుకోవాల్సిన స్వీయ రక్షణ చర్యలపై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Etv Eenadu Sadasu
చుట్టుపక్కల వాతావరణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని విద్యార్థినీలకు రఘువీర్ రెడ్డి సూచించారు. వెంటనే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. దిశ ఘటనలో నిందితులను 15 రోజుల్లో శిక్షించాలని ఫెస్టివ్ ఫోక్స్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ ఎడ్లపాటి ఉమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : విషాదం.. రెండు ప్రేమజంటల బలవన్మరణం
TAGGED:
Etv Eenadu Sadasu