రైతులకు మద్దతు తెలిపిన ఈటల Etela Rajendar Fire on Telangana Government : మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట్ మండలం బొమ్మరాశిపేట రైతులకు హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్ల క్రితం భూములను కొనుక్కున్న 1050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని.. ఆ భూములను బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని గుర్తు చేశారు. మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాకు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు రైతులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత భూమి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆ సమస్యలు ఇంకా అలానే ఉంచారని మండిపడ్డారు.
Etela Comments on CM KCR: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచిన ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. ధరణి వల్ల సాధారణ రైతులు వారి భూములను కోల్పోతున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 323 నుంచి 409 వరకు 1050 ఎకరాల భూముల్లో 50 సంవత్సరాలుగా రైతులు పండ్ల తోటలు, కోళ్ల ఫారంలు పెట్టుకుని జీవిస్తున్నారని వివరించారు. మట్టిని నమ్ముకున్న రైతుల విషయంలో అన్యాయం చేస్తే ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు. ఓ పత్రికలో రైతులను దొంగలుగా రాసారని.. ఆ పత్రిక ఎవరి కోసం పని చేస్తుందో అందరికీ తెలుసని అన్నారు.
Farmers Protest at Thoguta MRO Office : మా చెక్కులిచ్చే వరకు కదిలేదు లేదు.. ఎమ్మార్వో ఆఫీస్లో బైఠాయించిన రైతులు, ఎమ్మెల్యే
Etela Suport to Bommarasi Peta Formers: మధ్యవర్తుల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని కొంత మంది అన్నారని వెల్లడించారు. ఎంఆర్ఓలు, ఆర్డిఓలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించాలని పేర్కొన్నారు. ఈ సమస్యకి కలెక్టర్ స్పందించకపోతే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. బొమ్మరాశిపేట రైతులకు అండగా ఉండి పోరాడతారని తెలిపారు. ధరణిలో సమస్యల పరిష్కారం కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. వాటిపై వెంటనే సరైన చర్యలుచేపట్టాలని డిమాండ్ చేశారు.
"శామీర్ పేట్ మండలం బొమ్మరాశిపేట గ్రామంలో సర్వే నెంబర్ 323 నుంచి 409 వరకు 1050 ఎకరాల భూముల్లో 40 సంవత్సరాలుగా కూరగాయలు, పంటలు పండించుకొని జీవిస్తున్నారు. ధరణి పేరు చెప్పి కేసీఆర్, కేసీఆర్ బంధువులు, తాబేదారులు ఆ భూముల మీద కన్నేశారు. ఈ విషయంపై ధర్నా చేసేందుకు కలెక్టర్ కార్యాలయంలో అనుమతి తీసుకున్నారు. దీంతో వారు ధర్నా చేస్తుండగా.. పోలీసులు తీసుకువచ్చారు. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. ఈ సమస్యను జిల్లా యంత్రాంగం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను. లేనిపక్షంలో పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హెచ్చరిస్తున్నాను." - ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే
ఇవీ చదవండి :