ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు మేడ్చల్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సీనియర్ విభాగంలో రెండు మ్యాచ్లు జరిగాయి. తెలంగాణ టైగర్స్, హైదరాబాద్ హీరోస్ తలపడగా హైదరాబాద్ హీరోస్ గెలుపొందింది. సెంట్రల్ ఆంధ్ర, నార్త్ ఆంధ్ర టీమ్ లు ఆడిన మ్యాచ్లో సెంట్రల్ ఆంధ్ర టీమ్ విజయం సాధించింది.
జూనియర్ విభాగంలో రెండు మ్యాచ్లు జరిగాయి. తెలంగాణ టైగర్స్, హైదరాబాద్ హీరోస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ హీరోస్ విజయబావుటా ఎగరవేసింది. సెంట్రల్ ఆంధ్ర, నార్త్ ఆంధ్ర టీమ్లు తలపడగా నార్త్ ఆంధ్ర టీమ్ గెలిచింది.
హోరాహోరీగా సాగుతోన్న ఈనాడు క్రికెట్ పోటీలు - EENADU CRICKET LEAGUE
మేడ్చల్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సీనియర్, జూనియర్ విభాగాలు విడివిడిగా తలపడ్డాయి.
EENADU SPORTS LEAGUE
Last Updated : Jan 21, 2020, 11:59 PM IST