తెలంగాణ

telangana

ETV Bharat / state

హోరాహోరీగా ఈనాడు క్రికెట్ లీగ్ - MALLAREDDY ENGINEERING COLLEGE EENADU CRICKET GAMES

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నువ్వానేనా అన్నట్లు ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు కొనసాగుతున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు.

EENADU CRICKET GAMES HELD IN MALLAREDDY ENGINEERING COLLEGE EENADU CRICKET GAMES HELD IN MALLAREDDY ENGINEERING COLLEGE
హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Jan 20, 2020, 8:09 PM IST

ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో హోరాహోరీగా కొనసాగాయి. లీగ్​ మ్యాచ్​లలో సీనియర్, జూనియర్ విభాగాలు విడివిడిగా పోటీపడుతున్నారు. సీనియర్స్ విభాగంలో తెలంగాణ టైగర్స్, నార్త్ ఆంధ్ర నింజన్ పోటీపడగా తెలంగాణ టైగర్స్ విజయం సాధించింది. మరో మ్యాచ్​లో రాయలసీమ రాకర్స్, సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ మధ్య జరిగిన పోటీలో రాయలసీమ రాకర్స్ విజయబావుటా ఎగరవేసింది.

జూనియర్ విభాగంలో రెండు మ్యాచ్​లు జరగగా తెలంగాణ టైగర్స్, నార్త్ ఆంధ్ర నింజస్ పోటీపడగా నార్త్ ఆంధ్ర నింజాస్ విజయం సాధించింది. రాయలసీమ రాకర్స్, సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ పోటీపడగా సెంట్రల్ ఆంధ్ర చాలెంజర్స్ టీం విజయం సాధించింది.

హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'

ABOUT THE AUTHOR

...view details