తెలంగాణ

telangana

ETV Bharat / state

''లియో మెరిడియన్' ఉద్యోగులకు పూర్తి వేతనాలివ్వాలి'' - తెలంగాణ వార్తలు

లియో మెరిడియన్ రిసార్ట్స్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. ఈ సంస్థలో గతంలో 1500 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేయగా ప్రస్తుతం కేవలం 150మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.

dubbaka-mla-raghunandan-rao-meeting-with-leo-meridian-at-shameerpet-in-medchal-malkajgiri-district
లియో మెరిడియన్ ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలి: రఘనందన్

By

Published : Jan 9, 2021, 12:29 PM IST

Updated : Jan 9, 2021, 1:36 PM IST

లియో మెరిడియన్ రిసార్ట్స్​ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. లియో మెరిడియన్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడి హోదాలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామీర్​పేట్ రిసార్ట్​లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో 1500 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేయగా ప్రస్తుతం కేవలం 150మంది మాత్రమే ఉన్నారన్నారు. మిగతా వారిని ఇళ్లకు పంపించి జీతాలు ఇవ్వకుండా, విధులకు పిలవకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.

''లియో మెరిడియన్' ఉద్యోగులకు పూర్తి వేతనాలివ్వాలి''

ప్రస్తుతం పని చేస్తున్న 150 మందికి వేతనాల్లో కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే చెల్లిస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై 10 రోజుల్లో కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తామని, 1500ల మంది ఉద్యోగులకు తప్పకుండా న్యాయం జరిగేవిధంగా తమ కార్యాచరణ ఉంటుందని రఘునందన్ రావు తెలిపారు.

ఇదీ చదవండి:మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశం

Last Updated : Jan 9, 2021, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details