హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ వద్ద ద్విచక్రవాహనంపై పొడిగంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఓ ద్విచక్రవాహనం, రూ.రెండు లక్షలు విలువచేసే 20కిలోల పొడి గంజాయిని, ఒక ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఘట్కేసర్, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాల కళాశాలలోని విద్యార్థులకు కొన్ని నెలల నుంచి పొడి గంజాయిని సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
'నాగోల్‌లో గంజాయి పట్టివేత' - గంజాయి
హైదరాబాద్ నాగోల్ వద్ద పొడిగంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 20కేజీల పొడిగంజాయి స్వాధీనం చేసుకున్నారు.
'నాగోల్‌లో గంజాయి పట్టివేత'