తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: 'డ్రైవర్లు టీకా కోసం నమోదు చేసుకోవాలి'

మేడ్చల్ జిల్లా పరిధిలోని నిజాంపేట్ (nizampet) విజ్ఞాన్ విద్యాలయంలో సూపర్ స్ప్రెడర్ల కోసం కొవిడ్ వాక్సినేషన్(super spreader vaccination) కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్​లైన్​లో వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోని డ్రైవర్లు టీకా కేంద్రం వద్దకు వస్తే నమోదు చేస్తామని ఆర్డీవో సుశీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

nizampet hyderabad
super spreader vaccination: 'డ్రైవర్లు టీకా కోసం నమోదు చేసుకోవాలి'

By

Published : Jun 3, 2021, 7:02 PM IST

ఆన్​లైన్​లో వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోని డ్రైవర్లు టీకా కేంద్రం వద్దకు వస్తే నమోదు చేస్తామని ఆర్డీవో సుశీల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో సూపర్ స్ప్రెడర్లుగా (super spreader vaccination) నిర్ధరించిన క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలను అందిస్తుంది. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని నిజాంపేట్(nizampet) విజ్ఞాన్ విద్యాలయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఆ కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల వరకు వ్యాక్సిన్ తీసుకునేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని కొవిడ్ నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా ఆర్డీవో ప్రజలకు సూచించారు.

ఇదీ చూడండి:KTR: 'హెల్త్‌కేర్ వర్కర్లను దేవునితో సమానంగా చూస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details